VIDEO: పైపు లీకేజీ..వృధాగా పోతున్న మంచినీరు
KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి ఆలీ నగర్లో గత కొద్దిరోజులుగా మంచినీటి పైపు లైను డ్యామేజ్ అయింది. దీంతో మంచి నీరు వృధాగా పోవడం వల్ల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఇప్పటివరకు మరమ్మతులు చేయకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పైపులైను మరమ్మతు చేసి నీటి వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.