గ్రంథాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన పద్మజా
PLD: రొంపిచర్ల స్థానిక శాఖా గ్రంథాలయాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ ఎం. పద్మజా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న వార్తాపత్రికలు, పుస్తకాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందించారు. గ్రంథాలయాధికారి పనితీరు, సమయపాలనపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.