విమానంలో బీడీ తాగిన ఘటన కలకలం

విమానంలో బీడీ తాగిన ఘటన కలకలం

ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న విమానంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం టాయిలెట్‌లో బీడీ తాగటం కలకలం రేపింది. ఆశిష్ అనే ప్రయాణికుడు ఈ పని చేసినట్లు గుర్తించిన విమాన సిబ్బంది అతడి నుంచి లైటర్ స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్ అయిన తర్వాత ఈ ఘటనపై ఆకాశ ఎయిర్ విమాన సంస్థ గోవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.