VIDEO: ఘోర ప్రమాదం..లారి కింద పడి వ్యక్తి మృతి
MDK: చేగుంట-చిన్నశంకరంపేట మండల సరిహద్దులోని పొలంపల్లి పేపర్ మిల్లు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తా పడుతుండగా ప్రాణాలు కాపాడుకునేందుకు డ్రైవర్ కిందికి దూకాడు. అయితే దురదృష్టవశాత్తూ అదే లారీ వెనుక చక్రాల కింద పడి నలిగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.