మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్: నందిపేట మండలంలోని నూత్‌పల్లి, తొండాకూర్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్‌పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.