VIDEO: వికలాంగులు, వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులు, వృద్ధులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు నెలకు రూ.4,000 నుంచి రూ.6,000 పెన్షన్ పెంచి, వారిని ఆదుకోవాలని తెలిపారు.