వృద్ధులకు నిత్యావసరాలు, నగదు పంపిణీ
VSP: సింహాచలంలోని 98వ వార్డు కాపు వీధిలో సంక్రాంతి పండుగ వేళ కర్రి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదారత చాటుకున్నారు. ట్రస్ట్ అధ్యక్షులు కర్రి అప్పలస్వామి తన సొంత నిధులతో స్థానిక వృద్ధులకు, దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు, వస్త్రాలు, కూరగాయలతో పాటు ఒక్కొక్కరికి రూ.500 నగదును పంపిణీ చేశారు.