'భూములు ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా అప్పగించాలి'

SRCL: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నవారు స్వచ్ఛందంగా ముందుకువచ్చి అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ మేరకు సిరిసిల్ల శివారు సర్దాపూర్‌కు చెందిన లావణ్య పేరున 4.02 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలడంతో ఆమె భర్త రాములు పట్టా పాసు పుస్తకాలను గురువారం కలెక్టర్, ఎస్పీ సమక్షంలో అప్పగించారు.