VIDEO: ఘనంగా రంజాన్ వేడుకలు
MNCL: మంచిర్యాలలో ఇవాళ పవిత్ర రంజాన్ పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఈద్గా, అండాలమ్మ కాలనీలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.