VIDEO: 'దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి'
ఖమ్మం 9వ డివిజన్ రోటరీ నగర్ ఎన్ఎస్పీ కాల్వ పక్కన ఉన్న శ్రీ అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ పిల్లర్‌లను గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు కుమిలి శ్రీనివాసరావు ఇవాళ అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.