VIDEO: ఇమ్మి నర్సింగ్ కాలేజీలో రక్తదానం చేసిన విద్యార్థులు
PDL: ఫిరంగిపురం దీనాపూర్‌లోని ఇమ్మి నర్సింగ్ కాలేజీలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణాలను రక్షించే మహత్తర సేవ అని కళాశాల ఛైర్మన్ పుల్లగూర ఇమ్మానియేల్ ప్రకాష్ అన్నారు.