VIDEO: 'ఆటో కార్మికులకు చేయూత అవసరం'

VIDEO: 'ఆటో కార్మికులకు చేయూత అవసరం'

NZB: ఆటో కార్మికులను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆదివారం RSP పార్టీ నగర కన్వీనర్ కటారి రాములు డిమాండ్ చేశారు. మినీ ట్యాంక్ బండ్ ఆటో స్టాండ్ వద్ద అనుబంధ శ్రామిక్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఆటో రంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో, కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.