VIDEO: ఆంబోతుల పోట్లాటలో చిక్కుకుని తీవ్ర గాయాలు

VIDEO: ఆంబోతుల పోట్లాటలో చిక్కుకుని తీవ్ర గాయాలు

కోనసీమ: మామిడికుదురు(మం) పాసర్లపూడి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆంబోతులు పోట్లాడుతుండగా అమలాపురం నుంచి బైక్‌పై వస్తున్న తాటిపాకకు చెందిన రత్నకుమార్ ఆంబోతుల మధ్యలో చిక్కుకుని కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను వెంటనే అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.