థర్మల్ ప్లాంట్ ప్రతిపాదన రద్దు చేయాలని ఆందోళన
SKLM: థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన రద్దు చేయాలని నినాదాలతో బూర్జ మండల తిమడం గ్రామంలో ఆదివారం ఉదయం ధర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు సురేష్ దొర ఆధ్వర్యంలో గిరిజనులు, రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్లాంట్ ప్రతిపాదనకు సంబంధించిన ప్రతులను దగ్ధం చేశారు. ప్రభుత్వాన్ని నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.