కొడంగల్‌లో ఎన్నికల కోలాహలం

కొడంగల్‌లో ఎన్నికల కోలాహలం

VKB: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కొడంగల్ పట్టణంలో రాజకీయ కోలాహలం మొదలైంది. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌లో మొత్తం 11,668 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 6,007 మంది మహిళా ఓటర్లు కాగా, 5,661 మంది పురుష ఓటర్లు ఉన్నారు. కొడంగల్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించడంతో అభ్యర్థుల సందడి పెరిగింది.