'కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి'

'కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి'

SRD: పరిశ్రమల్లో పనిచేస్తే కార్మికులకు ప్రతి నెల రూ.  26 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ సహాయ కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు.  సంగారెడ్డి మండలంలోని పరిశ్రమల్లో గురువారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని పరిశ్రమల్లో నిబంధనలకు విరుద్ధంగా 12 గంటలు పని చేయిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.