అనుమానస్పదంగా వృద్ధురాలు మృతి

అనుమానస్పదంగా వృద్ధురాలు మృతి

నిజామాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన బీర్కూర్ మండలం బరంగెడ్గిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం నాగేంద్రాపూర్ దేవునిగుట్ట తండాకు చెందిన గైని మాదవ్వ(60) మృతదేహం గ్రామ శివారులోని మత్తడి కాలువలో లభ్యమైంది. వృద్ధురాలిని దుండగులు హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.