వీరాసనం వల్ల కలిగే ఉపయోగాలు
వీరాసనం మోకాలు, చీలమండలు, తొడలను బలోపేతం చేస్తూ.. శరీర వశ్యతను పెంచుతుంది. ఉదర అవయవాలను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అసిడిటీ, గ్యాస్ సమస్య తగ్గిస్తుంది. వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా వెన్ను కండరాలను బలోపేతం చేస్తుంది. దిగువ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ధ్యానానికి ఉత్తమమైన ఆసనం. మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.