VIDEO: 'ప్రతిభ కనపరిచిన బోడపాడు విద్యార్థులు'
ప్రకాశం: మార్కాపురం మండలం బోడపాడు ఎంపీపీ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు శెట్టిబట్టిన కౌశిక్, గంగిరెడ్డి భవిష్య నవోదయ సీట్లు సాధించారు. HM జాకబ్, టీచర్ శ్రీనివాసులు , తల్లిదండ్రులతో కలిసి మంగళవారం రాత్రి విద్యార్థులను సన్మానించారు. అలాగే టపాసులు పేల్చి, స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు.