'విద్యార్థి దశ ఎంతో గొప్పది'
CTR: విద్యార్థి దశ ఎంతో గొప్పదని కడప ఆర్జేడీ శామ్యూల్ తెలిపారు. పులిచెర్ల మండలం మంగళంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సమ్మెటివ్ 1లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఎంఈవో సిద్ధరామయ్య, పోకల తాతయ్య, హెచ్ఎం ఫజులుల్లా పాల్గొన్నారు.