స్త్రీ శక్తి పథకంపై మహిళలకు అవగాహన కార్యక్రమం..

VZM: ఎస్. కోట ఆర్టీసీ డిపో సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఎస్.కోట టు విశాఖపట్నం ,ఎస్.కోట టు అరకు, ఎస్.కోట నుంచి విజయనగరం ప్రయాణించు బస్సులలో మహిళలకు స్త్రీ శక్తి పథకం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు వారు ప్రయాణించే సమయంలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు గాని చూపించి పూర్తి ప్రయాణ రాయతి పొందాలని కోరారు. ఇందులో డిపో ఇంఛార్జ్ చుక్క వెంకటరమణ పాల్గొన్నారు.