మున్సిపల్ పోరుకు 'ఎర్రజెండా' సై..!
SRPT: మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు సూర్యాపేటలో కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు. లౌకిక పార్టీలతో కలిసి ఐదు మున్సిపాలిటీల్లో పోటీ చేస్తామని, ప్రజాసమస్యలపై కౌన్సిల్‌లో గళమెత్తే పోరాట యోధులను ఆదరించాలని కోరారు.