రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో మంగళవారం రోటరీ క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు ఉచిత కంటి, దంత పరీక్షలు నిర్వహించారు. వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన మందులు, కళ్లజోడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.