VIDEO: ఆకట్టుకున్న బండి షిడీ ప్రదర్శన
SRD: ఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో జరుగుతున్న మైలారం మల్లన్న జాతరలో ఇవాళ సాయంత్రం బండి షిడీ కార్యక్రమం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. గ్రామానికి చెందిన గొల్ల, యాదవ సంఘం ఆధ్వర్యంలో అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం ప్రకారం బండికి ఓ పొడుగాటి కర్రను అమర్చి, కర్ర చివరన ఓ భక్తుడు వేలాడుతూ.. సాహసోపేతంగా, మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రదర్శించారు.