ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
KDP: సిద్ధవటం మండలంలోని కమ్మపాలెం సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు సిద్ధవటం SI హారిక తెలిపారు. శుక్రవారం SI మాట్లాడుతూ.. కమ్మపాలెం సమీపంలో పేకాట ఆడుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. సిబ్బందితో కలిసి వెళ్లి పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 2,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.