నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో శుక్రవారం అంగన్‌వాడీ భవనం, కడారిగూడెం గ్రామపంచాయతీ నూతన భవనాలకు వర్ధన్నపేట MLA కె.ఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద,జడ్పి సీ ఈఓ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు