VIDEO: ప్రాణాలు కాపాడిన ఎస్సై
HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లేటి విశ్వతేజ భూమి బదిలీ విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బుధవారం గ్రామంలోని వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కిపెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ప్రవీణ్ కుమార్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని సురక్షితంగా కిందకు దిగేలా చేశారు.