హంస వాహనపై దర్శనం ఇచ్చిన స్వామివారు
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. నరక చతుర్దశి పురస్కరించుకుని సోమవారం రాత్రి హంస వాహనము పై పట్టణ పురవీధులలో శ్రీ స్వామివారు ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు.