గన్నవరం చేరుకున్న కన్నడ సూపర్ స్టార్
NTR: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. పాల్వంచలో తన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గుమ్మడి నరసయ్య’ సినిమా ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా, ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చానని ఆయన తెలిపారు. శివరాజ్‌కుమార్‌తో పాటు వచ్చిన చిత్ర దర్శకుడు పరమేశ్వర్ ఇవరాలాను కూడా అభిమానులు ఆత్మీయంగా స్వాగతించారు.