పేదలకు భూమిని పంచిన ఘనత తమదే: జాన్ వెస్లీ
NLG: తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత తమదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నాటి పోరాటం వెట్టిచాకిరి విముక్తికి, సామాజిక న్యాయానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. 3 వేల గ్రామాలను విముక్తి చేసి 'దున్నేవాడిదే భూమి' నినాదాన్ని నిజం చేశారని గుర్తుచేశారు. నేటి పాలకులు పేదల భూములు లాక్కోవడాన్ని ఆయన విమర్శించారు.