'సమ్మెకు డీవైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు'

'సమ్మెకు డీవైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు'

NLG: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు డీవైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నల్గొండలో ఇవాళ జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పడం సరికాదన్నారు.