ట్రంప్‌ది టారిఫ్ టెర్రరిజం: బాబా రామ్‌దేవ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ తీవ్రంగా విమర్శించారు. 'టారిఫ్ టెర్రరిజం అత్యంత ప్రమాదకరమైంది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ ఉంటే.. అది ఈ ఆర్థిక యుద్ధమే. దీనిలోనైనా కనీసం పేద దేశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అధికారంలో ఉన్నవారు సామ్రాజ్యవాద, విస్తరణ పోకడలకు పోతున్నారు' అని వెల్లడించారు.