నగరంలో హీరో శ్రీవిష్ణు సందడి

నగరంలో హీరో శ్రీవిష్ణు సందడి

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సినీ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రారంభం అనంతరం ఆయన రెస్టారెంట్‌లోని వివిధ వంటకాలను రుచి చూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సందడి చేశారు.