సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
ELR: ఆగిరిపల్లి మండలం ఈదుల గూడెం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో యాక్ట్, మాదకద్రవ్యాల వాడకం వలన కలుగు దుష్పరిణామలపై అవగాహన నిర్వహించారు. నూజివీడు రూరల్ ఇన్‌ప్సెక్టర్ కె రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్క్‌ను అవసరం మేరకు వాడాలని సూచించారు.