జిల్లా నాయకులకు కీలక పదవులు
VSP: టీడీపీ పొలిటికల్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను నియమిస్తూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కమిటీల్లో 13 మంది జిల్లా నాయకులకు కీలక పదవులు దక్కాయి. పల్లా శ్రీనివాసును రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన రామారావు, నజీర్‌లను ఈసారి జాతీయ కమిటీలోకి తీసుకుని ఉపాధ్యక్షులుగా నియమించడం గమనార్హం.