మరో 2 మున్సిపాలిటీల హోదా పెంపు
AP: రాష్ట్రంలోని మరో 2 మున్సిపాలిటీల హోదాలను పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కు, తూ.గో. జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని గ్రేడ్-2 నుంచి స్పెషల్ గ్రేడ్‌కు పెంచింది. 2022-25 కాలంలో ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని హోదా పెంచుతూ వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.