VIDEO: 'విద్యార్థులు సైబర్ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలి'
WNP: విద్యార్థులు క్రమశిక్షణతో చదువు కోవడంతో పాటు మంచి నడవడిక కొనసాగించాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. మంగళవారం ఆత్మకూరు సీవీ రామన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. అప్పుడే విజయం సాధించగలమని విద్యార్థులకు తెలియజేశారు. సైబర్ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగ ఉండాలన్నారు.