ప్రపంచ దేశాలకు భారత్ నుంచి 'e-విటారా' ఎగుమతి

గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో తయారైన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'e-విటారా' ను ఆయన ఆవిష్కరించారు. ఈ వాహనాలను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి చేయనున్నారు. అలాగే, టీడీఎస్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్‌ను కూడా మోదీ ప్రారంభించారు.