గుర్తింపులేని పార్టీలకు షోకాజ్ నోటీసులు జారీ

GNTR: జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయబడి 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీచేయని గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీచేసిందని కలెక్టర్ నాగలక్ష్మీ బుధవారం తెలిపారు. గ్రేట్ ఇండియా పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీలకు నోటీసులు ఇచ్చామన్నారు. ఆ పార్టీల బాధ్యులు ఈ నెల 28లోపు వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్‌లో హాజరు కావాలన్నారు.