VIDEO: గాలివానకు ఇళ్ల పైకప్పులు ధ్వంసం

కొయ్యూరు మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కొత్త బొర్రంపేట గ్రామంలో చెట్లు విరిగి పడ్డాయి. అలాగే గ్రామానికి చెందిన మర్రి అప్పారావు, బాబూరావు, శంకర్ లకు చెందిన ఇళ్లు ధ్వంసం అయ్యాయని గ్రామస్తులు తెలిపారు. ఇళ్ల పైకప్పులు కూలి పోయాయని, రేకులు ఎగిరిపోయి ఛిద్రం అయ్యాయన్నారు. ఇళ్లలో ఉన్న సామాగ్రి, నిత్యావసరాలు తడిసిపోయాయన్నారు.