'నేడు యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగింపు'

'నేడు యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగింపు'

అన్నమయ్య: దిత్వా తుఫాను బలహీనపడటంతో రాష్ట్రంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అయితే, తుఫాను బలహీనపడటంతో నేడు ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో ఆ జిల్లాల్లో యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.