'యూరియా వాడకం తగ్గించాలి'

'యూరియా వాడకం తగ్గించాలి'

GNTR: కొల్లిపర మండలంలో ఈ-పంట నమోదు చేసుకోని రైతులు ఈ నెలాఖరులోగా నమోదు చేసుకోవాలని సోమవారం మండల వ్యవసాయ అధికారి ఎన్. శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రైతులు యూరియా ఎక్కువగా వాడడం వల్ల పంటకు కలిగే నష్టాలను ఆయన వివరించారు. యూరియాకు బదులుగా నానో యూరియా, డీఏపీ వాడాలని, నత్రజని, పొటాష్‌లకు బదులుగా పీఎస్‌బీ, కేఎస్‌బీ వంటి జీవ ఎరువులను ఉపయోగించాలని తెలిపారు.