పత్తికొండలో “ఓట్ చోర్-గద్దె చోడ్" కార్యక్రమం
KRNL: పత్తికొండలో జరిగిన “ఓట్ చోర్ - గద్దె చోడ్” కార్యక్రమంలో 27,500 సంతకాలు సేకరించామని నియోజకవర్గ ఇంఛార్జ్ అడ్వకేట్ క్రాంతి నాయుడు తెలిపారు. ఈ సంతకాలను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలానీ భాషకు అందజేశారు. ప్రజా ద్రోహం, అవినీతిపై ఇది ప్రజాస్వామ్య సమాధానం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.