హాస్టల్లో సివిల్ సప్లై అధికారుల తనిఖీలు

హాస్టల్లో సివిల్ సప్లై అధికారుల తనిఖీలు

KMR: జిల్లా సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బిచ్కుంద మండల కేంద్రంలోని పలు హాస్టల్లలో దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్, బీసీ బాల బాలికల, ఎస్సీ బాల బాలికల హాస్టల్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు సరిగా అందించాలని పేర్కొన్నారు.