ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఏబీవీపీ ధర్నా
WNP: ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నగర ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నాచేపట్టారు. ఈ మేరకు అర్జున్ సాతర్ల మాట్లాడుతూ.. విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.8,500 కోట్లు ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.