VIDEO: ఫ్లైఓవర్ వద్ద లారీ బోల్తా
PLD: నరసరావుపేట పట్టణంలోని చిలకలూరిపేట ఫ్లైఓవర్ సమీపంలో ఇవాళ ఉదయం సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం వల్ల రోడ్డుపై వాహన రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.