ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు: ఎస్పీ

GNTR: నగరంలోని శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన కంకరగుంట ఆర్యూబీ, శంకర్ విలాస్, డొంకరోడ్డులోని మూడు వంతెనల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పరిశీలించారు. త్వరలో శంకర్ విలాస్ పాత బ్రిడ్జిని కూల్చివేయనున్న నేపథ్యంలో సమస్యలు తలెత్తకుండా చూస్తామని అన్నారు.