వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి గురువారం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కోలాహలంగా దర్శనమిస్తోంది. మాస శివరాత్రి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఇబ్బందులు లేకుండా ఆలయ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.