'గురజాడ జయంతి, వర్దంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి'
VZM: జాతీయ స్మారక కేంద్రంగా గురజాడ అప్పారావు నివాసాన్ని తీర్చిదిద్దాలని ప్రముఖ కవి తెలకపల్లి రవి, సామాజిక వేత్త దేవి డిమాండ్ చేశారు. ఈరోజు గురజాడ వర్థంతి సందర్భంగా విజయనగరం పట్టణంలో జరిగిన గౌరవ యాత్రలో వారు పాల్గొన్నారు. గురజాడ ప్రపంచానికి తెలుగు భాష ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహా కవి అని ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.