చెట్లు నరికివేతపై 72 గంటలు నిరసన
కెన్యాలో అడవుల నరికివేతపై ముథోని అనే యువతి 48 గంటలపాటు చెట్టును కౌగిలించుకుని నిలబడి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆమె తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఇందుకోసం ఆమె నైరీ పట్టణంలోని ప్రభుత్వ ప్రాంగణంలో ఒక చెట్టును ఎంచుకున్నారు. చెట్టును పట్టుకుని 72 గంటలపాటు ఆమె అలాగే నిలబడి ఉన్నారు. వాతావరణ మార్పు, అటవీ నిర్మూలన వల్ల కలిగే ప్రమాదం గురించి అవగాహన పెంచుకోవాలని ఆమె కోరారు.